ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. 68 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ GAD ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ జీవోఆర్టీనెంబర్ 2033ను ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రఘువీర్ రెడ్డిని ఎన్నికల సమయంలో బదిలీ చేసిన ఈసీ విషయం తెలిసిందే.