కేంద్ర టూరిజం శాఖ గండికోట, పుష్కర్ ఘాట్‌కు నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. రాష్ట్రంలో గండికోటకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ప్రజలకు కూడా ఉపయోగ పడేలా అభివృద్ధి చేస్తామని వివరించారు. రాజమహేంద్రవరం కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పుష్కర్ ఘాట్ నిర్మాణం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు.
మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారని తెలిపారు. అరసవిల్లిని ప్రసాద్ స్కీమ్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. పర్యాటకానికి అవకాశం ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరామని అన్నారు. కేంద్ర సహకారం తీసుకుని ఏపీని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.