చేనేత కార్మికులకు మంచి రోజులు రానున్నాయి. విజయనగరం జిల్లాలో వందలాది మందికి ఉపాధి లభించే అవకాశం దక్కనుంది. విజయవాడ సమీపంలోని మంగళగిరి తరహాలో చేనేత శాల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అందుకు రాజాం మండలం పెనుబాక గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇక్కడి సొసైటీ అభివృద్ధి పథంలో నడుస్తుండడంతో చేనేత శాలకు ఇదే సరైన ప్రాంతంగా భావించింది. స్థల పరిశీలన కూడా పూర్తయింది. చేనేత శాలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి అందించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణం ప్రారంభం కానుంది.