డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌బీఐ హెడ్‌గా ఒక ఇండో అమెరికన్‌ని ఎంచుకున్నారు. ఈ గుజరాతీ కాష్ పటేల్.. ట్రంప్‌కి విధేయుడు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తదుపరి డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ని నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కాష్ పటేల్, ట్రంప్‌నకు చిరకాల మద్దతుదారుడు. "డీప్ స్టేట్" అనే ఘర్షణాత్మక ఆలోచనకు ప్రసిద్ధి చెందిన ఈ కొత్త ఎఫ్‌బీఐ హెడ్.. గతంలో అమెరికన్ దర్యాప్తు సంస్థను తీవ్రంగా విమర్శించారు.
రాబోయే సంవత్సరాల్లో ఎఫ్‌బీఐకి నాయకత్వం వహించే అవకాశం ఉన్న కాష్ పటేల్.. ఇండో అమెరికెన్, గుజరాతీ. ఆయన డొనాల్డ్ ట్రంప్ ఎజెండాను విశ్వసిస్తారు. వాటిని అమలు చేస్తారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఎజెండాలను నిర్వర్యం చేసేందుకు ఎఫ్‌బీఐ సహా అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు పని చేశాయని కాష్ పటేల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదీ.. ట్రంప్ కొత్తగా నియమించిన కాష్ పటేల్ విధేయత. నిరంతరం మారుతున్న రాజకీయ వాతావరణంలో, ముఖ్యంగా 2015లో, కాష్ పటేల్ డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత స్థిరమైన విధేయులలో ఒకరిగా అవతరించారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
ఇంకా చెప్పాలంటే.. ట్రంప్‌కి బలమైన మద్దతుదారుడిగానే కాష్ పటేల్ అని క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నారు. ట్రంప్ అమెరికన్ ఎజెండాకు ముప్పుగా భావించే వారిపై ఘర్షణాత్మక వైఖరిని గతంలో ప్రదర్శించారు.
2016లో హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ మాజీ చైర్మన్ డెవిన్ న్యూన్స్‌కు పటేల్ సహాయకుడిగా పనిచేశారు. ఇది ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ వృత్తిలోకి మారడానికి దారితీసింది. అప్పుడే ట్రంప్ విధేయుడిగా పేరు సంపాదించింది.