మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, అర్ధరహితంగా ఉన్నాయని పలు పార్టీలు, ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు పార్వతీపురంలో గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సోమవారం సిపిఎం నాయకులు రెడ్డి వేణు తదితర ప్రజాపక్ష నాయకులు పాల్గున్నారు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.