మన్యం జిల్లాలో ఏడేళ్ల క్రితం తిష్ట వేసిన ఏనుగుల గుంపుతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని కుమ్మరిగుంటలో సోమవారం ఏనుగులు కుమ్మేసిన పంట పొలాలను పరిశీలించారు.
చేతికి అందించిన అనేక కూరగాయ పంటలను ఏనుగులు గుంపు గత నెల రోజులుగా ధ్వంసం చేస్తున్నాయని, దీంతో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఏనుగుల గుంపు రూపంలో నష్టపోతున్నారన్నారు.