గంజాయి వ్యాపారులను గుర్తించి, వారి ఆస్తులను జప్తు చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం.
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిందితులు, వారి ఆస్తుల జప్తు చేసేందుకు చేపట్టాల్సిన విధివిధానాలు, నిబంధనలను వివరించారు.