మన్యం జిల్లా రెవెన్యూ అధికారిగా కె హేమలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభికకు మర్యాదపూర్వకంగా కలిశారు.
హేమలత గతంలో పార్వతీపురం, పాలకొండ, విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పార్వతీపురం రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. హేమలత జిల్లా రెవెన్యూ అధికారిగా నియామకం పట్ల జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.