చోడవరం శ్రీ స్వయంభు గౌరీశ్వర వారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రమణ్య స్వామి వారి షష్టి మహోత్సవ కార్యక్రమాలు ఈనెల 7వ తేదీన నిర్వహించినట్టు ఆలయ కమిటీ మంగళవారం తెలిపింది.
మేరకు స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు చేతుల మీదుగా ఆలయ ప్రాంగణంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 22వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతి తెలిపారు.