పెదబయలు మండలంలోని పాతరూడకోట గ్రామానికి వెళ్లే రహదారికి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం నిర్మించిన రహదారిపై పలుచోట్ల పెచ్చులు ఊడిపోయి శిధిలావస్థకు చేరుకుందని దీంతో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు.
ఎదుర్కొంటున్నామని పలువురు వాహనచోదకులు మంగళవారం తెలిపారు. అధికారులు స్పందించి ఈ రహదారికి మనమ్మతులు చేపట్టాలని పలువురు వాహనదారులు వాహనచోదకులు కోరుతున్నారు.