ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతగిరి మండలంలోని గాలికొండ ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతం దట్టమైన పొగమంచుతో కప్పబడ్డాయి.
దీనితో అరకు సందర్శనకు వస్తున్న యాత్రికులు పొగ మంచు అందాలను ఆస్వాదిస్తూ హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగిస్తూ పొగమంచు అందలు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. పొగమంచుతో కూడిన చిరుజల్లులు కురుస్తుండడంతో అరకు ఏజెన్సీలో ప్రాంతంలో మంగళవారం చలి తీవ్రత కూడా ఎక్కువైంది.