విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలపై జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ హైకోర్టులో వేసిన పిల్ బుధవారం విచారణకు వచ్చింది.
ఈ నేపథ్యంలో ఎర్రమట్టి దిబ్బలపై జరుగుతున్న పనులు ఆపేయాలని తీర్పు వెలువరించింది. ఎర్రమట్టి తవ్వకాలు సీఆర్‌జెడ్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.