తన కాలేజీ మిత్రుడు పెట్టుబడుల పేరిట రూ.15 లక్షల విలువైన బంగారాన్ని తీసుకుని, మోసం చేసినందుకు బెంగళూరులో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎఫ్ఎఆర్ ప్రకారం, నిందితుడు దిగంత్ క్యాసినోలలో డబ్బు పెట్టమని బాధితురాలు ప్రియాంకను కోరగా, ఆమె బంగారు నగలు ఇచ్చింది.
తర్వాత తిరిగివ్వాలని కోరినా అతడి నుంచి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి ఇంటి బాల్కనీలో ఉరి వేసుకుంది.