బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో అన్నపూర్ణ ఆపన్న హస్తం ద్వారా వృద్ధులకు ఆహార పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు పాల్గొని వృద్ధులకు ఆహారాన్ని, దుప్పట్లను పంపిణీ చేశారు. కేన్సర్ తో బాధపడుతున్న పలగర సరస్వతికి మందుల కొనుగోలు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు.