భీమవరం జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సర్వే (ఎంఎస్‌ఎంఈ) ప్రారంభం కానుంది. ఈనెల 4వ తేదీ నుం చి జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేలో వ్యాపారాలకు సంబంధించి ప్రతి షాపు, పరిశ్రమల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేస్తారు. ప్రత్యేక యాప్‌లో సర్వే వివరాలను నమోదు చేస్తారు. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో కమిషనర్ల పర్యవేక్షణలో సర్వే చే స్తారు. సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలకు, కమిషనర్లకు అవగాహన కల్పించారు. 3వ తేదీన సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి 4వ తేదీ నుంచి సర్వే ప్రారంభిస్తారు.