బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కమిటి సభ్యులు ధర్ముల సురేష్ మాట్లాడుతూ..విద్యుత్ చార్జీలు పెంచబోనంటూ హామీలు ఇచ్చి గద్దినెక్కాక ఇప్పుడు ట్రూ అప్ చార్జీలతో ప్రజలపై పెనుబారం మోపుతున్నారని ఆరోపించారు. తక్షణమే ట్రూ ఆఫ్ పేరున పెంచిన రేట్లను ఉపసంహరించుకోవాలన్నారు.