మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ పేరు ఖరారైంది. గురువారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు BJP కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఫడణవీస్‌ను BJP శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.ముఖ్యమంత్రి ఎంపిక కోసం దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దేవేంద్ర ఫడణవీస్ పేరును ఖరారు చేశారు.భారతీయ జనతా పార్టీ నేత చంద్రకాంత్ పాటిల్ ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా, పంకజ ముండే మద్దతు పలికారు.సరిగ్గా నాలుగు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, రాష్ట్రంలో బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టడంలో ఫడణవీస్ కీలకపాత్ర పోషించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.గత పదేళ్లుగా బీజేపీతోపాటు మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడణవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.