జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)లోని పరాఖ్ స్వతంత్ర సంస్థ నిర్వహించిన రాష్ట్రీయ సర్వే క్షణ్-2024లో భాగంగా, 3, 6, 9 తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను చీరాల పాఠశాలల్లో బుధవారం పరీక్షించారు. గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం వంటి అంశాలతో పాటు విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలపై ప్రశ్నలు ఇచ్చారు.మండల విద్యా శాఖాధికారిణి- సుధారాణి,ఆర్వీ రమణ,వెలుగొండా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.