కమీషన్ల గురించి, అవినీతి గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. కమీషన్లు తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు తీసింది జగన్ కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలు, దళితులపై దౌర్జన్యాలు, దమనకాండలు వైసీపీ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు.
జగన్ భ్రమల్లో విహరించడం మాని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని లేకుంటే పూర్తిగా పతనమవుతారని హెచ్చరించారు.వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనివ్వలేదని.. అయితే, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.