సూపర్ సిక్స్ అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. ఆర్నెళ్లయినా సూపర్ సిక్స్ జాడేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికీ తమ పార్టీ తెచ్చిన పథకాలు, విధి విధానాలేమిటో ప్రకటించలేదన్నారు. చంద్రబాబు ఇంత కాలయాపన చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతులకు సాయం చేయలేదు. యువతకు ఉద్యోగాలు. నిరుద్యోగులకు భృతి ఇవ్వనేలేదు. ఇరవై లక్షల మంది యువతకు ఇస్తానన్న మూడు వేల రూపాయల మాటేది. వారికి ఉద్యోగాలు ఎప్పుడిస్తారో బాబు చెప్పాలని ఆమె నిలదీశారు. 18యేళ్లు పూర్తి చేసిన ఏ ఒక్కరికైనా 1500 ఇచ్చారా అని ఆమె డిమాండ్ చేశారు.