ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, రేణిగుంట-గూడూరు, కోటిపల్లి-నర్సాపూర్ లైన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. బుధవారం.. లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లు-2024పై జరిగిన చర్చలో ఎంపీ లావు మాట్లాడుతూ బిల్లును స్వాగతించారు. ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను అనుసంధానం చేసే అమరావతి ప్రాజెక్టుకు రూ.2,245 కోట్లతో ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ లాక్‌డౌన్‌లో నిలిపివేసిన రైల్వే స్టాపులను పునరుద్ధరించాలన్నారు.
![]() |
![]() |