‘ట్రస్టు పేరుతో సేవ చేయాల్సింది పోయి అరబిందో సంస్థ ఘోర పాపాలు చేసింది. ఒక్క 104 సర్వీసులోనే రూ.175 కోట్లు దోచేస్తే, ఇక 108 సర్వీసులో ఇంకెన్ని వందల కోట్లు దోచేసిందో?. 104, 108 సర్వీసుల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ లేదా సీఐడీ విచారణ వేయాలి. అరబిందో సంస్థ యాజమాన్యానికి కఠిన శిక్షలు పడాలి’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులో మాట్లాడారు.
గతంలో సత్యం రామలింగరాజు, జీవీకే సంస్థలు 104, 108 సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించి రోల్ మోడల్‌గా నిలిస్తే, ఇప్పుడు అరబిందో సంస్థ భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. రెండన్నరేళ్ల కాలంలో 34 లక్షల కేసులకు సంబంధించి 17.80 లక్షల మంది పేషెంట్ల విషయంలో గోల్డెన్ అవర్ పాటించలేదన్నారు. ఈ విషయాన్ని కాగ్ నిర్ధారించిందని చెప్పారు.