రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ అమూన్ ఆదేశాల మేరకు అధికారులు రైసు మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు, లీగల్ మెట్రాలజీ, పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన 5 ప్రత్యేక బృందాలు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కృష్ణా జిల్లాలోని రైసు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాయి. ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఖరీఫ్ ముగిసేవరకు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని సివిల్ సప్లయిస్ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa