మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీలో 45094 పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్లో ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ఇంత పెద్దఎత్తున పేరెంట్స్, టీచర్లతో సమావేశాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలోని 2604 పాఠశాలల్లో బడి పండుగ జరుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.మెగా పేరెంట్, టీచర్ మీటింగులకి భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో వసతులు, అభివృద్ధిపై విస్తృతంగా చర్చించామన్నారు. తాను టీచర్‌గా పని చేశానని.. విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. ప్రతి విద్యార్థి మేథావేనని.. వారికి ప్రభుత్వం తరుపున ప్రోత్సహం, శిక్షణ పునాదులు ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. 'నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ,, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా తయారు అయ్యాను'' అని గుర్తుచేసుకున్నారు. విద్యార్థికి ఫౌండేషన్ విద్య చాలా అవసరమన్నారు. మంత్రి లోకేష్ విద్యాశాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
.