బాపట్ల పట్టణం 6వ వార్డులో ఏమి శ్రీనివాసరావు కు చెందిన పూరిల్లు శనివారం ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఇంటిలో ఉన్న2 గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం వలన ఇల్లు పూర్తిగా దగ్ధమైనది. శ్రీనివాసరావు అగ్ని మాపక దళానికి సమాచారం అందించగా సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. నష్టం అంచనా ఇంకా తెలియ రాలేదు. బాపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.