ఓర్వకల్లు మండలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కబ్జాలను అరికట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న, మండల కార్యదర్శి మధుసూదన్ డిమాండ్ చేశారు. సోమవారం నన్నూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో స్పెషల్ కలెక్టర్ కళ్యాణి, తహసీల్దార్ విద్యాసాగర్ కు వినతిపత్రం అందించారు. నన్నూరులో 40 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి పట్టా పుస్తకాలు పొందిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో లేక సంక్షేమ పథకాలు పొందడం లేదన్నారు.