బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ పార్టీ తరుఫున ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్య పోటీ చేస్తున్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. బీసీ రిజర్వేషన్లపై చట్టసభల్లో పోరాటం చేస్తానన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతోనే సాధ్యమన్నారు. బీసీల కోసం తాను చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ ఈ అవకాశం ఇచ్చిందన్నారు. మరోవైపు తాను పార్టీలు మారడం లేదన్న ఆర్. కృష్ణయ్య పార్టీలే తన వద్దకు వస్తున్నాయని అన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్. కృష్ణయ్య.. ఆ తర్వాతి కాలంలో వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్య.. ఇప్పుడు అదే స్థా్నానికి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.