ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్4 రావడం కలకలం రేపింది. పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు రావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు పురోగతి సాధించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నూక మల్లికార్జున్ అని, మానసిక స్థితి సరిగ్గా లేదని, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో వైజాగ్‌లో నూక మల్లికార్జున్‌పై 354 కేసు నమోదైంది.