గత 5 ఏళ్లలో వైసీపీ భూ బకాసురులు రాష్ట్రంలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని టీడీపీ ఎమ్మెల్సీ, శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల నుంచి దేవాదాయ, అసైన్డ్, వక్స్, లిడ్ క్యాప్ భూముల వరకు అన్నీ కొట్టేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ఈ ఐదు నెలల్లో వచ్చిన లక్ష 74 వేల ఫిర్యాదుల్లో 68 వేల ఫిర్యాదులు భూకబ్జాలపైనే అని తెలిపారు. వైసీపీ భూమాఫియాకు హెడ్ జగన్ అయితే, సమన్వయకర్తలు సజ్జల, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిలు అంటూ వ్యాఖ్యలు చేశారు.