వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విజయసాయిని లోపలేయటానికి పింక్ డైమండ్‌పై చేసిన అసత్యం ఒక్కటి చాలన్నారు. ఒళ్లు కొవ్వెక్కి విజయసాయి ముఖ్యమంత్రిని తిడుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయసాయి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు జగన్‌తో అవినీతిలో పోటీపడిన ఏ2 విజయసాయి అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.