గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల నాయకులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. ఆ గుంతల్లో మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గుత్తి నుంచి గుంతకల్లుకు ఈ రోడ్డు గుండా నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయన్నారు. అయితే గుంతలు పెద్దఎత్తున పడడంతో వాహనదారులు ప్రయాణించాలంటే ఇబ్బంది పడుతున్నారన్నారు. సమస్య తెలిసినా అధికారులు గుంతలు పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు రోడ్డులో గుంతలు పూడ్చాలని కోరారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రామదాసు, అంజనప్రసాద్, రాజు, అడవిరాముడు, మల్లికార్జున, మల్లేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.