వైసీపీ హయాంలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై మోయలేని భారాన్ని పెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ కన్నా మహానటుడు ఎవరున్నారుని ప్రశ్నించారు. పదే పదే అబద్దాలు చెప్పడంతోపాటు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి కూడా ప్రజా రక్షకుడిగా ఫోజు పెట్టడం జగన్ లాగా ఎవరికైనా సాధ్యమవుతుందా అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచకపాలన సాగించి ఇప్పుడేమో ఏమీ జరగక్కున్నా మొసలి కన్నీరు కార్చడం ఆయనకు మాత్రమే సరిపోతుందని ఎద్దేవా చేశారు.విద్యా వ్యవస్థను దారిలో పెట్టి రాష్ర్టాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు చేస్తున్న శ్రమను జగన్ నటన అంటుంటే ప్రజలంతా ఆయనను ఛీదరించుకుంటున్నారని అన్నారు.
ఆయన చేతకాని తనం వల్లే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయని చెప్పారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత నారా లోకేష్ అహర్నిషలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నటించడం మానేసి కూటమి ప్రభుత్వం మాదిరిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం జగన్ రెడ్డి నేర్చుకోవాలని అన్నారు. లేకుంటే ఇప్పటికి లెవెన్ రెడ్డిగా ఉన్న పెద్ద జీరో రెడ్డిగా మారిపోతావు...తస్మాస్ జాగ్రత అని హెచ్చరించారు.