కొత్తవలసకు చెందిన కర్రి లక్ష్మీ దీపక్ కరాటేలో తన ప్రతిభ కనబరిచాడు. ఈనెల 8న విశాఖపట్నంలో జరిగిన 18వ ఏపీ స్టేట్ ఇన్విటేషన్ కెన్ యురియో కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో పాల్గొన్నారు.
ఈ పోటీల్లో లక్ష్మీ దీపక్ తన ప్రతిభ కనబరిచి రెండు బంగారు పతకాలు సాధించినట్లు కోచ్ సూర్య నూకరాజు కొత్తవలసలో మంగళవారం తెలిపారు. వాగ్దేవి కళాశాలలో చదువుతున్న దీపక్ ను కళాశాల సిబ్బంది, పలువురు క్రీడాకారులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa