ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైతే మానసిక ప్రశాంతత సొంతం చేసుకోవచ్చని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పట్టణం నాలుగు రోడ్ల కూడలి వద్ద వెలసిన దుర్గ తల్లి అమ్మవారు ఆలయ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆ వేడుకలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరయ్యారు. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.