ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే ఒక్క ఎక్సర్‌సైజ్‌తో బరువు.. బెల్లీతో పాటు ఈ సమస్యలన్నీ దూరం

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 09:32 PM

చూడ్డానికి సింపుల్‌గా కనిపించే వర్కౌట్స్ ఎన్నో లాభాలని తీసుకొస్తాయి. అందులో స్కిప్పింగ్ కూడా ఒకటి. చిన్నప్పుడు ఆడే ఆటల్లో స్కిప్పింగ్ కూడా ఒక ఆట. దీనిని పెద్దవారు చేయడం వల్ల కూడా ఫ్యాట్ లాస్ జర్నీలో మ్యాజిక్‌లా పనిచేస్తుంది. ఈ స్కిప్పింగ్ అనేది హై ఇంటెన్సిటీ వర్కౌట్ అని చెప్పొచ్చు. దీనిని చేయడం వల్ల మజిల్స్, చెస్ట్, బ్యాక్, షోల్డర్స్, బైసెప్స్, ట్రైసెప్స్, గ్లూట్స్ ఇలా బాడీలోని ప్రతి పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది.


స్కిప్పింగ్ చేయడం వల్ల ఎంజాయ్ చేస్తారు. దీనివల్ల ఎంత హ్యాపీగా చేస్తారు. అంతగా హార్మోన్స్, సెరటోనిన్ వంటివి రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిని ఎలా చేస్తే కేలరీలు బరువు, బెల్లీ తగ్గుతారో తెలుసుకోండి.


హ్యాపీగా తగ్గండి..


​స్కిప్పింగ్ అనేది ఈజీగా కనిపించే హై ఇంటెన్సిటీ వర్కౌట్. దీనిని రెగ్యులర్‌గా చేస్తే మజిల్స్ గ్రూప్‌పై పనిచేసి ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది బాడీ. దీనిని రెగ్యులర్‌గా చేయడం వల్ల ఎక్సర్‌సైజ్ చేసినంత రిజల్ట్ ఉంటుంది. స్టామినా పెరుగుతుంది. దీంతో కేలరీలు కూడా కరుగుతాయి.


ఎంత సేపు చేయాలి..


అయితే, స్కిప్పింగ్ మంచిదే.. ఎంత చేయాలనేది కూడా తెలుసుకోవాలి. బిగినర్స్ అయితే నిమిషం, 2 నిమిషాలు చేయాలి. దీనిని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ 15 నుంచి 30 నిమిషాల వరకూ పెంచుకోవచ్చు. ఈ స్కిప్పింగ్ చేయడం వల్ల 650 కేలరీల నుంచి 100 0 కేలరీల వరకూ ఖర్చవుతాయి.


బెల్లీ తగ్గేందుకు..


స్కిప్పింగ్ అనేది చూడ్డానికి సింపుల్‌గా, కాంప్లికేషన్ లేని వర్కౌట్. అయినప్పటికీ దీనిని రెగ్యులర్‌గా చేస్తే బెల్లీ చాలా వరకూ తగ్గుతుంది. కారణం ఇది హై ఇంటెన్సిటీ వర్కౌట్. దీనిని చేయడం వల్ల కేలరీలు తక్కువ టైమ్‌లోనే బర్న్ అవుతాయి.


కొలెస్ట్రాల్ తగ్గేందుకు..


స్కిప్పింగ్ అనేది బెల్లీని తగ్గించే వర్కౌట్స్‌లో ఒకటి. ఇది త్వరగా కెలరీలని బర్న్ చేసి మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. అధ్యయనాల ప్రకారం హైఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వర్కౌట్ లాంటి స్కిప్పింగ్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది. ముఖ్యంగా విసెరల్ ప్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది. హార్ట్ రేట్‌ని పెంచడం వల్ల వర్కౌట్ పూర్తయ్యేసరికి కేలరీలు బర్న్ అవుతాయి.


మజిల్స్ మొత్తానికీ..


ఈ వర్కౌట్ చేయడం వల్ల చాలా మజిల్స్ గ్రూప్, కోర్ ఎంగేజ్ అవుతుంది. దీంతో బాడీ, అబ్డామినల్ ఏరియా ఇంప్రూవ్ అయి ఫిట్‌గా ఉంటారు. స్కిప్ చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సెటివిటీ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఇవన్నీ కూడా బెల్లీని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.


ఎలా చేయాలి..


స్కిప్పింగ్ చేసేముందు కచ్చితంగా వార్మప్ చేయాలి. 2, 3 నిమిషాల పాటు వార్మప్ చేసిన తర్వాత బాడీకి రెస్ట్ ఇచ్చాక చేయాలి.


ఈ వర్కౌట్ ఒకేతీరుగా చేయొద్దు. 30 సెకన్ల పాటు చేసి 30 సెకన్ల పాటు రెస్ట్ ఇవ్వాలి. దీని వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది.


కార్డియో వర్కౌట్స్ చేసేవారు దాని బదులు 15 నుంచి 20 నిమిషాల పాటు స్కిప్పింగ్ వారానికి 3, 4 రోజులు చేయొచ్చు.


ఈ స్కిప్పింగ్‌ని బాడీ వెయిట్‌ని బట్టి స్ట్రెంథ్ ట్రైనింగ్‌తో కలిపి చేయొచ్చు. పుషప్స్, స్క్వాట్స్‌తో కలిపి చేయొచ్చు.


చలికాలంలో ఇంట్లోనే ఈ వర్కౌట్ చేయొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com