ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు నిద్దామని, ఏపిఈపిడిసిఎల్ ఎస్ఈ ఎం. లక్ష్మణరావు పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.
దీనిలో భాగంగా తొలిరోజు కలెక్టరేట్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీని నిర్వహించారు. రోజురోజుకూ దేశంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోందన్నారు. ముఖ్యంగా సౌరశక్తి వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందని తెలిపారు.