నేడు డిసెంబర్ 15వ తేదీన ముఖ్యమైన గ్రహ సంచారం జరగబోతోంది. గ్రహాల రాజు సూర్యుడు నేడు రాత్రి పది గంటల 19 నిమిషాలకు ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తాడు.ధనుస్సురాశిలో సూర్య సంచారంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశిలో సంచరిస్తున్న సూర్యుడు జనవరి 14వ తేదీ వరకు ధనస్సు రాశి లోనే ఉంటాడు.
ధనుస్సు రాశిలో సూర్యుడు
సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇక సూర్యుడు ధనస్సు రాశి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సంపన్న యోగం పడుతుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
సింహరాశి
సూర్యుడు సింహరాశికి అధిపతి. అటువంటి సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల సింహరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశి వారి ఆరోగ్యం ఈ సమయలో బాగుంటుంది. కుటుంబంతో వీరు సంతోషంగా గడుపుతారు. వివాహం చేసుకున్న వారికి సంతాన యోగం ఉంది. ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు.
తులారాశి
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో కష్టపడి చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు. ఆరోగ్యంగా జీవిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో సూర్య సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ఈ సమయంలో మీరు చేసిన శ్రమ గుర్తించబడుతుంది. ధనుస్సు రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్ని విధాలుగా ధనుస్సు రాశి వారికి శుభ సమయం.
కుంభరాశి
సూర్య సంచారం కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి జాతకులు ఏ పని చేసిన ఈ సమయంలో కలిసొస్తుంది. ఎప్పటినుండో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ధన ప్రయోజనాలు కలుగుతాయి .ఆర్దిక స్థిరత్వం కలుగుతుంది. కుంభ రాశి వారికి ఇది అదృష్టాన్ని ఇచ్చే సమయం.
కర్కాటక రాశి
ధనస్సు రాశిలో సూర్య సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసిన అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది . వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సమయానికి డబ్బు అందుతుంది.