టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటుమెరక ఎస్టీ కాలనీలో నిర్మాణమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి సామూహిక అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించి సత్సంగ కార్యక్రమం చేశారు. బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు మాట్లాడుతూ మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం చాలా ముఖ్యమైనదన్నారు. సంక్రాంతి వరకు సాంప్రదాయాలను పాటిస్తూ దైవరాధన చేయాలని సూచించారు.