ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. జోగి రమేష్‌తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని బుద్దా తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి వ్యక్తులతో టీడీపీ నేతలు అంటకాగితే తామెలా పోరాటం చేయాలని ప్రశ్నించారు. అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచన వస్తోంది అంటూ బుద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ నాడు చంద్రబాబు ఇంటి పై దాడికి వెళ్లిన జోగి రమేష్ .. తాము అడ్డుకున్న సమయంలో జరిగిన వివాదం’’ వంటి అంశాలతో ఫోటోలను బుద్దా ప్రదర్శించారు. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూజివీడులో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని.. నీచంగా దూషణలు చేసి... చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అంటూ మండిపడ్డారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందన్నారు. జోగి రమేష్‌తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెలు మీద తన్నిన విధంగా ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa