పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ నుంచి మాయం అయిన అంశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. పేర్ని నాని గోడౌన్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు అందులో ఉన్న బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహన్ మట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో గోడౌన్ పై కూడా అనుమానం ఉందని... తనిఖీ చేస్తామని తెలిపారు. ప్రజలకు చెందిన బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. తప్పు చేసిన వాళ్లు చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరని చెప్పారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని అన్నారు.