రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించి పదేళ్లు దాటేసింది.2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలను అసలు పట్టించుకోలేదు.దీంతో గత ఐదేళ్లు కార్పొ రేషన్‌కు పాలకవర్గం లేకుండా పోయింది. ప్రత్యేకాధికారుల పాలనలోనే నడిచింది. దీంతో గత వైసీపీ నాయకుల ఇష్టారా జ్యంగా మారపోయింది. ఇష్టాను సారం గా నిధులు ఖర్చు చేసేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఎన్నికల మీద ఆశ కలిగింది.పాలక వర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని.. డివిజన్లలో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ప్రజ లంతా వాపోతున్నారు. గతంలో మా డివిజన్‌లో సమస్య ఉంటే కౌన్సిలర్‌కు తెలియజేసే వారమని..ఏదో ఒక విధంగా పరిష్కారమ య్యేదని.. ఇప్పుడు ఎవరికి చెప్పాలో అర్ధం కావడంలేదని వాపోతున్నారు. ఎన్నికల తో పాటు సుమారు 20 గ్రామాల విలీన సమస్య ఉంది.వాటిని విలీనం చేసి గ్రేటర్ రాజమహేంద్రవరంలో అభివృద్ధి చేయాల నేది స్థానిక ప్రజల కోరిక.ఇటు ఎన్నికలు జరగలేదు. గ్రామాల విలీనమూ లేదు. ఆ గ్రామాలకు ఎన్నికలూ జరగలేదు. ఎన్ని కలు లేకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదనే ఆందోళన ఉంది. మంత్రి గ్రామాల విలీనం.. ఎన్నికలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.