దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్న తరుణంలో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 80,182కి పడిపోయింది. నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 24,198కి దిగజారింది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (0.64%), సన్ ఫార్మా (0.63%), టీసీఎస్ (0.55%), టెక్ మహీంద్రా (0.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.40%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-3.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.56%), ఎన్టీపీసీ (-2.09%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.02%), అదానీ పోర్ట్స్ (-1.79%).