దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 964 పాయింట్లు కోల్పోయి 79,218కి దిగజారింది. నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 23,951కి పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.11%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.09%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.50%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.33%), ఏసియన్ పెయింట్స్ (-2.25%), బజాజ్ ఫైనాన్స్ (-2.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.83%).