జి. సిగడాం మండలం సంతఉరిటీ గ్రామానికి చెందిన కరగాను ప్రవళిక క్రానిక్ డయేరియాతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు శుక్రవారం రూ. 5 లక్షల సీఎం సహాయనిది చిక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.