ధనుర్మాసం సందర్భంగా వెధుళ్ళవలసలో మేలుకొలుపు పూజలు నిర్వహించారు. శనివారం వేకువ జామున ఆముదాలవలస మండలంలోని వెధుళ్ళ వలస గ్రామంలో గ్రామానికి చెందిన భక్తులు మేలుకొలుపు నిర్వహించారు. ఈ సందర్భంగా భవనామస్మరణతో భక్తి గీతాలు ఆలపించారు. భజన మండలి సభ్యులు నారాయణరావు ఆధ్వర్యంలో మహిళలు భక్తులు మేలుకొలుపు కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామంలో నిర్వహిస్తూ మాట్లాడుతూ మేలుకొలుపు చేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.