బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. గోల్డ్ రేట్లు మళ్లీ దిగొచ్చాయి. హైదరాబాద్ నగరంలో తాజాగా రూ. 300 తగ్గగా 22 క్యారెట్ల బంగారం రేటు తులం రూ. 70,400 కు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 76,800 కు పడిపోయింది. మరోవైపు వెండి ధర రూ. 1000 పడిపోగా ప్రస్తుతం కేజీకి రూ. 98 వేలకు దిగొచ్చింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు మరోసారి పెరుగుతున్నాయి.