దేవరపల్లి మండలంలో కుక్కలు బెడద ఎక్కువగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దేవరపల్లిలో ప్రధాన రహదారిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వాహనదారులు, పాదచారులపై కుక్కలు ఒక్కసారిగా మీదపడడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పల్లంట్లరోడ్డు సెంటరు, మూడుబొమ్మల సెంటర్, మూడురోడ్ల కూడలి వద్ద కుక్కలు అధిక సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో స్కూల్ పిల్లలు, ప్రజలు హడలెత్తిపోతు న్నారు. స్థానిక బస్టాండ్ వద్ద ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పల్లంట్ల, యర్నగూడెం గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.