ఓ వైపు విస్తారంగా వర్షాలు పడుతున్నప్పటికీ రైతులు పంట పొలాల్లో తమ తమ పనులు కానిచ్చేస్తున్నారు. అయితే రైతులకు ఇప్పుడు యూరియా ఎంతో ముఖ్యం. పంట పొలాల్లో చల్లేందుకు రైతులు యూరియాను ఉపయోగిస్తుంటారు. అయితే యూరియా కోసం రైతులు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. పుష్కలంగా యూరియా ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.యూరియా కోసం సొసైటీల వద్ద రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. సొంత ప్రాంతం వారికి కాకుండా బయట నుంచి వస్తున్న వారికి ప్రాముఖ్యత ఇస్తూ వారికే యూరియాను ఇస్తున్నారని జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు.
యూరియా కోసం సొసైటీలు, ఆర్‌ఎస్‌కేల వద్ద బారులు తీరారు అన్నదాతలు.జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు కో ఆపరేటవ్ సొసైటీలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా ఎప్పుడు ఇస్తారా అని రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే గోడౌన్ లో యూరియా ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యూరియాకు డిమాండ్ బాగా ఉండటంతో ప్రైవేటు డీలర్లు తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. బయట ఎరువుల దుకాణాలలో ఒక యూరియా భస్తా కావాలంటే మరో డీఏపీ భస్తా కొనాలంటూ ఆంక్షలు విధించారు.దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తూ సొంత మండలానికి ఇవ్వలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి స్లిప్పులు చేతిలో పెట్టుకుని యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. యూరియా పుష్కలంగా ఉన్న ఎందుకు రైతులకు ఇవ్వడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.