సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతిని కల్పించాలని ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ చదలవాడ నాగరాణి హౌసింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై వసతి గృహాల మరమ్మత్తులపై సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు రూ. 1. 29 కోట్ల చొప్పున తొలి విడత పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందన్నారు.