ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖంపై మొండి మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గాలంటే.. పచ్చి పాలలో ఇవి కలిపి రాయండి..

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2024, 11:03 PM

ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. తమ చర్మం ఎప్పుడూ అందంగా, మచ్చ లేకుండా ఉండాలని భావిస్తారు. కానీ ముఖం మీద చిన్న చిన్న మచ్చలు ఉంటే.. చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. శరీరంలో మెలనిన్ స్థాయిలు పెరగడమే మచ్చలకు ప్రధాన కారణం. అయితే, తప్పుడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి కారణంగా ముఖంపై మచ్చలు వస్తాయి. ముఖంపై మచ్చలు మీ అందాన్ని తగ్గిస్తాయి. ముఖంపై వివిధ ప్రదేశాలలో నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి.


ఈ మచ్చల వల్ల చర్మం నల్లగా కనిపిస్తుంది. ముఖంపై ఉన్న మొండి మచ్చలను తొలగించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మరికొందరు పార్లర్లకు వెళ్లి ఖరీదైన ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటారు. అయితే, వీటి వల్ల లాభం ఉండపోక.. భారీగా ఖర్చవుతుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాల్ని పాటిస్తే ఈ మొండి మచ్చలను వదిలించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్‌లో పచ్చి పాలు ముందుంటుంది. పచ్చి పాలు చర్మపు మచ్చలను తొలగించడంలో సాయపడుతుంది. దీని రెగ్యులర్ వాడకంతో చర్మం మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది. పచ్చి పాలను ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.


పచ్చిపాలతో ఉపయోగాలు..


పచ్చి పాలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. సాధారణంగా పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యానికి మాత్రమే కాదు పాలను ఉపయోగించడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని కొద్ది మందికే తెలుసు. చలికాలంలో చర్మ సంరక్షణలో పాలను చేర్చుకోవచ్చు. పచ్చి పాలలో అనేక పోషకాలు, ఎంజైమ్‌లు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, సహజంగా మెరిసేలా చేస్తాయి. అయితే, పచ్చిపాలలో ఇంట్లో దొరికే వాటిని వాడితే మంచి ఫలితాలుంటాయి.


పచ్చి పాలు, పసుపు..


ముఖం నుంచి మొండి మచ్చలు తొలగించడానికి పచ్చి పాలలో పసుపు కలిపి అప్లై చేయవచ్చు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లియర్ చేయడంలో. మఖాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు కూడా తొలగించవచ్చు.


వాడే పద్ధతి..


ఇందుకోసం రెండు నుంచి 3 చెంచాల పాలలో చిటికెడు పసుపు కలపడం ద్వారా మందపాటి పేస్ట్ సిద్ధం చేయండి. ఇప్పుడు కాటన్ సహాయంతో ముఖానికి పట్టించాలి. ఇప్పుడు దీన్ని 4 నుంచి 5 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు.


పచ్చి పాలు, తేనె..


పచ్చి పాలలో తేనె కలిపి అప్లై చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. నిజానికి, హైడ్రోజన్ పెరాక్సైడ్ తేనెలో ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి పాలు, తేనె మిశ్రమం చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేయడంలో సాయపడుతుంది. పిగ్మెంటేషన్‌ను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.


వాడే పద్ధతి..


చర్మంపై మెరుపును తీసుకురావడానికి మీరు తేనె, పచ్చి పాల మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు 4 నుంచి 5 టీస్పూన్ల పాలలో 1 టీస్పూన్ తేనె కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి అప్లై చేసి సర్క్యులేషన్ మోషన్‌లో మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి.


ముల్తానీ మట్టి కూడా ట్రై చేయవచ్చు..


ముల్తానీ మిట్టిని ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముల్తానీ మిట్టిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసి అందులో 1 చెంచా పాలు కలపండి. ఈ మెత్తని పేస్ట్‌ని మీ ముఖంపై 5 నుంచి 10 నిమిషాల పాటు అప్లై చేయండి. ఆరిపోయిన తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మచ్చలు, ముడతల్ని తగ్గించడంలో ఈ రెమిడీ ప్రభావవంతంగా పనిచేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com